![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -09 లో.....అనాధాశ్రమం నుంచి జానకమ్మ ఒక్కొక్కరిని పంపిస్తుంది. రేవతి తీసుకొని వెళ్లడానికి ఇద్దరు భార్యాభర్తలు వస్తారు. అంజలిని వదిలివెళ్తుంటే రేవతి ఎమోషనల్ అవుతుంది. అక్కాచెల్లెల్ల కంటే ఎక్కువ ఉంటారు.. అందుకే అంత బాధపడుతున్నారని జానకమ్మ అంటుంది. అందరిని పంపించేసావ్ కదమ్మా అని అంజలి ఏడుస్తుంది.
మరొకవైపు మనీష్ దగ్గరికి గీతాంజలి వస్తుంది.నీతో మాట్లాడాలిరా.. మీ తాతయ్య ఏంటి అలా ఉన్నాడు.. ఏదో విషయం గురించి బాధపడుతున్నాడు.. అదేంటో కనుక్కోవాలి.. ఏ విషయం అయిన నాకు చెప్పేవాడు.. ఇప్పుడు చెప్పడం లేదంటే తను బాధపడేది నా గురించి అనుకుంటా అని గీతాంజలి అనగానే అలా ఏం అయి ఉండదు అత్తయ్య మీ గురించి బాధపడడానికి ఏం ఉంటుందని మనీష్ చెప్తాడు. మరొకవైపు జానకమ్మ దగ్గరికి రాజారాం వస్తాడు. మీరు వస్తారు అనుకోలేదని జానకమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా మనవరాలిని పిలవండి అని రాజారాం అనగానే అంజలిని జానకమ్మ పిలుస్తుంది. అంజలిని చూసి రాజారాం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను మీ తాతయ్య అని జానకమ్మ చెప్పగానే అంజలి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తాతయ్య లాంటి వాడిని అని రాజారాం అనగానే అంజలి డిస్సపాయింట్ అవుతుంది.
అంజలి నువ్వు వెళ్లి కాఫీ తీసుకొని రా అని జానకమ్మ తనని పంపిస్తుంది. ఆ తర్వాత జానకమ్మకి రాజారాం చెక్ ఇస్తాడు. అంజలి భవిష్యత్తు కోసం అంటాడు. అప్పుడు మీ కొడుకు చేసిన తప్పు ఇప్పుడు మీరు చేస్తున్నారని జానకమ్మ కోప్పడుతుంది. తరువాయి భాగంలో ఇవి ఫ్యామిలీ గురించి తెలిపే ఆధారాలు అని అంజలికి కొన్ని పేపర్స్ ఇస్తుంది జానకమ్మ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |